Thursday, April 18, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం

తిరుపతి సిటీ : 76వ స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఈ నెల 15వ తేదీ జరుగుచున్న సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జేసి బాలాజీ తో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మాక్ డ్రిల్ నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శకటాలు, వివిధ శాఖల స్టాళ్ల‌ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి ఉట్టి పడేలా చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ వారిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, ఆర్ డిఓ, కనక నరస రెడ్డి, తుడా సెక్రటరీ లక్ష్మి, డిఆర్డిఏ పిడి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement