Thursday, April 25, 2024

‘కల్యాణమస్తు’కు ముహూర్తాలు ఖరారు..

తిరు‌మ‌ల – టిటిడి కల్యాణమస్తుకు మళ్ళీ ముహూర్తాలు ఖరారయ్యాయి. దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో కల్యాణమస్తు కార్యక్రమం కింద పేద జంట‌లకు వివా‌హాలు జరి‌పిం‌చేం‌దుకు టీటీడీ సన్నా‌హాలు చేస్తు‌న్నది. తిరు‌మ‌ల‌లోని నాద‌నీ‌రా‌జనం వేది‌కపై  శ్రీవారి ఆలయ పండి‌తులు భేటీ అయి మే 28 మధ్యాహ్నం 12.34 నుంచి 12.40 వరకు, అక్టో‌బర్‌ 30 ఉదయం 11.04 నుంచి 12.40 వరకు, నవం‌బర్‌ 17 ఉదయం 9.56 నుంచి 10.02 వరకు కల్యా‌ణ‌మస్తు ముహూ‌ర్తా‌లను నిర్ణయించి లగ్న పత్రిక రాశారు. గతంలో 44 వేల‌కు‌పైగా జంట‌లను ఒక్కటి‌చే‌సిన కల్యా‌ణ‌మ‌స్తును కొన్ని కార‌ణాల వల్ల నిలి‌పి‌వే‌సిన టీటీడీ.. మళ్లీ పదేండ్ల తర్వాత ప్రారం‌భి‌స్తు‌న్నది. కల్యా‌ణ‌మ‌స్తులో వివాహం చేసు‌కొనే జంట‌లకు మంగ‌ళ‌సూత్రం, నూతన వస్త్రాలు, 40 మందికి అన్నప్రసాదం ఏర్పా‌టు‌చే‌స్తా‌మని టీటీడీ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement