Wednesday, April 24, 2024

జగనన్న అంటే.. మాట తప్పడు.. మడమ తిప్పడు : మంత్రి ఆర్కే రోజా

తిరుపతి సిటీ : పేద‌ల సంక్షేమ‌మే ధ్యేయంగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితోనే రాష్ట్రాఅభివృద్ధి సాద్య‌మ‌ని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం తిరుపతి జిల్లాకు సంబంధించిన వైయస్సార్ వాహన మిత్ర నాలుగవ విడత పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రతీ పథకం పేదలకోసమే ఆలోచిస్తారని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. జగనన్న అంటే… మాట తప్పడు.. మడమ తిప్పడు అని ఈరోజు మరో సారి  రుజువైంద‌న్నారు. జగన్  సీఎం  అయ్యాక ప్రారంభించిన మొట్ట మొదట పథకం ఈ వైఎస్సార్ వాహన మిత్ర అన్నారు. ప్రతీ ఏటా ఈ పథకం లబ్ధిదారులు పెరుగుతున్నారు. అర్హత సాధించిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తోంది. 

రాష్ట్ర వ్యాప్తంగా  మొత్తం 2 లక్షల 62 వేల  మంది లబ్దిదారులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.  ఈ పథ‌కంలో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు 10 వేలు చొప్పున  ఆర్థిక సాయం ప్రతీ ఏటా అందిస్తున్నారు.  ఈ నాలుగో విడతలో సుమారు 262 కోట్లను వాహన మిత్ర లబ్ధిదారులకు మన ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2 లక్షల 62 వేల  మంది లబ్ధిదారుల్లో  63 వేల 594  మంది ఎస్సీలు, 1,44, 164 మంది బీసీలు,  10,472  మంది ఎస్టీలలకు లబ్ధి చేకూరిందని అంటే  మొత్తం లబ్దిదారుల్లో 83 శాతం బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల వారే ఉండటం విశేషం అన్నారు. నాలుగు విడతలు కలిపి వెయ్యి 25 కోట్లను కేవలం ఈ వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అందించిన ఏకైక సీఎం మన జగనన్న అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement