Tuesday, March 26, 2024

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం చెల్లించాల్సిందే – టిటిడికి హైకోర్టు ఆదేశం…

తిరుప‌తి : ఉద్యోగ.. కార్మికులు అణ గారిన వర్గాలకు చె ందిన వారు.. వారికి మధ్య వేతనాల వ్య త్యాసం తగదు.. ఆ ఉద్యోగి రెగ్యుల రైనా.. తాత్కాలికమైనా సమాన పనికి సమాన వేత నం చెల్లించాల్సిందే.. అలా చేయకపోతే వివక్షత చూపటంతో పాటు శ్రమశక్తిని దోచుకున్నట్లే అవు తుందని వ్యాఖ్యానించింది హైకోర్టు. తిరుమల తిరుపతి దేవ స్థానంలో వేతనాల వ్యత్యాసాన్ని ఆక్షేపిస్తూ శాశ్వత ఉద్యోగికైనా, తాత్కాలిక ఉద్యోగికైనా సమాన వేనతాలు చెల్లించాల్సిందే అని మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. టీటీడీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో కాంట్రాక్ట్‌ ఉద్యోగు లుగా పనిచేస్తున్న సి రుక్మాంగదరెడ్డి తో పాటు మరో పది మందికి మిగిలిన ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ప్రోత్సాహకాలను అందించాల్సిందే అని స్పష్టం చేసింది. టీటీడీ గోసంరక్షణ శాలలో 2003 నుంచి పనిచేస్తున్న ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు అధిక వేతనం చెల్లిస్తూ తమ విష యంలో మాత్రం కనీస వేతన స్కేళ్లను అమలు చేయ టంలే దంటూ రుక్మాం గదరెడ్డి మరో 10 మంది 2011లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అధిక వేతనం పొందుతున్న వారితో సమానంగా తాము పనిచేస్తు న్నామని కోర్టుకు వివరించారు. ఈ వ్యాజ్యం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ముందుకు వచ్చిం ది. టీటీడీ తరుపు న్యాయవాది ఎ సుమంత్‌ వాదనలు వినిపించారు. 2011లో పాలకమం డలి తీర్మానం మేరకు మిగిలిన వారితో సమానంగా వేతనం పొం దేందుకు పిటిషనర్లు అర్హులుకా రన్నారు. వాద నలు విన్న న్యాయ మూర్తి పిటిషనర్లు మిగిలిన ఉద్యో గులతా సమానంగా వేతనం పొం దేందుకు అర్హులు కాదా అనే అం శంపై తుది విచారణ జరిపి తేలుస్తా మన్నారు. ఈ వ్యాజ్యాన్ని భౌతిక విచారణ ద్వారా విచారిస్తామని కోవిడ్‌ నేపథ్యంలో ఆ పరిస్థితులులేవని తెలిపారు.
ప్రతి ఉద్యోగి శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నా తాత్కా లికంగా పనిచేస్తున్నా మిగిలిన వారితో సమానంగా పనిచేస్తున్నప్పుడు వే తనం చెల్లింపులో వ్యత్యాసమెందు కని ప్రశ్నిం చారు. ఇది వివక్షత చూపటమే అని రాజ్యాం గంలోని 14వ అధికరణకు అది విరుద్ధమన్నారు. సమాన వేత నాలు చెల్లించక పోవటం సమాజంలో దోపిడీకి గుర య్యే వర్గాలను దోచుకోవటమే అవుతుంద న్నా రు. పిటి షనర్లు శ్రీవారి పాదాల చెంత 15 సంవ త్స రా లుగా పని చేస్తున్నారు.. వారికి సమాన వేతన సిద్ధాం తాన్ని వర్తింప చేయాలని చెప్పటంలో కోర్టు ఎంత మాత్రం సంశ యించటంలేదని ఆ మేరకు వారికి చె ల్లింపులు జరపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement