Tuesday, April 23, 2024

ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలి : కేంద్ర రైల్వే మంత్రికి తిరుప‌తి ఎంపీ లేఖ

నాయుడుపేట. వెందోడు రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలుపుద‌ల చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి శుక్రవారం లేఖ‌ రాశారు.. నాయుడుపేట వెందోడు. రైల్వే స్టేషన్ల నుంచి పరిసర గ్రామాల ప్రజలు అనునిత్యం వ్యాపార అవసరాల రీత్యా, అనారోగ్య కారణాలతో సమీపంలోని చెన్నై మహానగరానికి, జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి దైవదర్శనానికి వ‌స్తుంటార‌న్నారు.

అలాగే బర్డ్స్, సిమ్స్, రుయా, అరవింద్ కంటి ఆసుపత్రి వంటి పేరు కలిగిన వైద్య సదుపాయాలు ఉన్నటువంటి హాస్పిటళ్ల‌కు వెళ్లేందుకు అనువుగా నాయుడుపేట స్టేషన్లో 12604, చెన్నై ఎక్స్ ప్రెస్, హైదరాబాద్ నుండి చెన్నై 17644.. కాకినాడ పోర్ట్ నుండి చెంగ‌ల్ ప‌ట్టు, నవజీవన్ ఎక్స్ ప్రెస్ .. చెన్నై అహ్మదాబాద్, చెన్నై నుండి సూళ్లూరుపేట వరకు వస్తున్న మెము యూనిట్ ని నాయుడుపేట వరకు పొడిగించాలని, అలాగే నిమ్మకాయల వ్యాపారి కేంద్రమైన వెందోడు స్టేషన్ ఉన్న జయంపు గ్రామం నుండి పలు సుదూర ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంద‌న్నారు. అందువలన విందోడు రైల్వేస్టేషన్లో హౌరా ఎక్స్ ప్రెస్, తిరుపతి నుండి హౌరా, కృష్ణ ఎక్స్ ప్రెస్, నుండి ఆదిలాబాద్ రైలు నిలుపుదల చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ ద్వారా తిరుపతి డాక్టర్ గురుమూర్తి విన్నవించడం జరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement