Wednesday, April 17, 2024

తిరుమలలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి

  • విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వలన కలిగే అనర్ధాలపై అవగాహన కలిగించండి
  • స్పెషల్ ఎన్ఫోర్మ్సెంట్ బ్యూరో కమిషనర్ రవి ప్రకాష్

తిరుపతి సిటీ మే 25 (ప్రభ న్యూస్) : తిరుపతి, తిరుమల ఒక ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం ఇక్కడ గంజాయి డ్రగ్ వాటికి తావు లేదని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రవి ప్రకాష్ తెలియజేశారు. గురువారం పోలీస్ అతిథి గృహం నందు జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈబి స్టేషన్ లో ఎస్ హెచ్ఓలు పని తీరును సమీక్షించి తగిన సూచనలు సలహాలను అందించి ప్రస్తుతం ముందు వస్తున్న సవాల్ గురించి క్షుణ్ణంగా విసిద్ధికరించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఎం.రవి ప్రకాష్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు ఎస్ఈబి వారు సమిష్టిగా 36 ఎన్డి పిఎస్ కేసులో నమోదు చేసి 166 మంది నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాల‌కు అనుగూనంగా మాదకద్రవ్య రహిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధనమే లక్ష్యంగా పెట్టుకొని అత్యంత ప్రణాళిక బద్ధంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఇలాంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి సమీక్షించుకోవడం జరుగుతున్నదని వివరించారు.

పాఠశాలు, కళాశాలలో విద్యాసంస్థల నందు ఎన్డిపిఎస్ చట్టం గురించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులను చైతన్యవంతులను చేసి భవిష్యత్తులో వారు వారి సహచరులు మాదకద్రవ్యాలను వినియోగించకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. అందరూ డ్రగ్ కి బానిసలు కారు.. చ‌డు వ్యసనాలకి కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల జల్సాలకు అలవాటు పడి డబ్బు సంపాద‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని జీవించే కొన్ని అసాంఘిక శక్తుల వల్ల యువత పెడదారి పడుతున్నదని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశయాలను తుంగలోద్దెక్కి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అన్నారు. ఒకవేళ కళాశాలలో ఎవరైనా డ్రగ్ కు అలవాటు పడిన బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని గుర్తించి ఆ విద్యాసంస్థల యాజమాన్యం సహకారంతో వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో బాధ్యత విద్యార్థులకు పోలీస్ శాఖ కౌన్సిలింగ్ ఇప్పించి వార్డులో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కళాశాలలో విద్యా సంస్థల ముందు ఇప్పటికే సుమారు 165 ప్రదేశాల్లో డ్రగ్ గురించి చైతన్యపరిచే హోల్డింగ్లను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. పోలీస్ ఎస్ఈబి వారికి ఎక్కడైనా మత్తు పదార్థాల‌ పై సమాచారం తెలిస్తే వెంటనే అక్కడికి చేరుకుని వాటి పూర్వపరాలను కూడా విచారణ చేయడం జరుగుతుందన్నారు.

- Advertisement -

గత మూడు సంవత్సరాలు కాలంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలు గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతున్నన్నారు. చ‌డు వ్యసనాలు నుండి కాపాడి వారి జీవితంలో వెలుగులు నింపడానికి ప్రత్యేక ప్రణాళికతో పాటు పోలీస్ ఎస్‌ఈబి ముందడుగు వేయాలి అన్నారు. ఎన్డిపిఎల్ కేసుల్లో సంబంధించి ఉన్న అందరిపై గంజాయి షీట్ ను తెలిసి ఆ సమాచారాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు సమాచారం ఇవ్వ‌డం వలన ఇతర జిల్లాల పోలీసులు వారు కూడా సమాచారం చేరి అప్రమత్తంగా ఉండేందుకు ఎంతగానో ఆస్కారం ఉంటుందన్నారు. పోలీస్. ఎస్.ఈ.బి. ఎక్సైజ్ రైల్వే పోలీస్ ఇతర అన్ని శాఖలను ఈ నిర్దిష్ట ప్రతిష్టాత్మకమైన పనిలో భాగస్వాములను చేసి సమన్వయంతో సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా గ్యాంబ్లింగ్ రెడ్ శాండిల్ ఇసుక స్మగ్లింగ్ నాటు సారాయి బెల్ట్ షాపు, ఎన్డిపీఎల్ వంటి వాటిని కూడా అరికట్టేందుకు అన్ని రకాల ప్రణాళికతో సాంకేతిక పరమైన ముందు చూపుతో వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఈబి జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర, గూడూరు ఎస్ఈబి డివిజనల్ అధికారులు, జిల్లాలోని ఎస్ఈబిఎస్ హెచ్ఓలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement