Thursday, March 28, 2024

స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మకు సిపిఎం అభినందనలు

తిరుపతి – వందలాది మంది కరోనా రోగుల ప్రాణాలను తన సమయస్ఫూర్తితో కాపాడిన స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మను సిపిఎం నేత కందారపు మురళి ఓ ప్రకటనలో అభినందించారు. బుధవారం నాటి ఉదయం స్విమ్స్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు తగ్గి పోయిన సమాచారాన్ని ఉదయం నాలుగు గంటలకు తెలుసుకున్న డైరెక్టరు వెంగమ్మ ఆ సమయంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలను నిద్రలేపి ప్రమాద తీవ్రతను తెలియజేశారు. కలెక్టరు, ఎస్పీ, స్విమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ లు సంయుక్తంగా వ్యూహాత్మక నిర్ణయాలు చేసి ఇరవై ఐదు నిమిషాలలో ఆక్సిజన్ ట్యాంకర్లు తిరుపతికి చేరుకునేట్లు చేశారు. దీంతో వెంటిలేటర్లు, ఆక్సిజన్ మాస్కుల పై ఉన్న వందలాది మంది కరోనా రోగుల ప్రాణాలు నిలబడ్డాయి. ఇంతటి ప్రమాదకర పరిస్థితిలోనూ విశ్వాసం కోల్పోకుండా, సమర్థవంతంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని, పోలీసు సిబ్బందిని, స్విమ్స్ సిబ్బందిని పరుగులు తీయించి ఆక్సిజన్ సాధించి ప్రాణాలు కాపాడిన డాక్టర్ వెంగమ్మ గారిని, స్విమ్స్ సిబ్బందిని అందరూ అభినందించాలని కందారపు మురళి ఓ ప్రకటనలో కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement