Wednesday, April 17, 2024

చెట్టు కిందే కట్టెగా….

మదనపల్లె రూరల్‌, : కరోనా వైరస్‌తో మదనపల్లె జిల్లా అస్పత్రికి వచ్చిన ఓ రోగికి బెడ్‌ దొరక లేదు. ఉదయం నుంచి సాయ ంత్రం వరకు వైద్యం అందక అస్పత్రి ఆవరణ లోని చెట్టు- కిందనే ఉన్నాడు. చివరకు అక్కడే ప్రాణాలు విడిచాడు. తన కళ్ల ఎదుటే భర్త ప్రాణా లు పోవడంతో ఆ ఇల్లాలు ఆవేదన వర్ణనాతీతం గా మారింది. హృదయ విదారకమైన ఈ ఘటన శుక్రవారం మదనపల్లెలో చోటు చేసుకుంది. మృతుని భార్య చెప్పిన వివరాల మేరకు.. పీటీఎం (పెద్దతిప్ప సము ద్రం) మండలం, కొండయ్యగారిపల్లెకు చెందిన 60ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో శుక్రవా రం మదనపల్లి జిల్లా అస్పత్రికి భార్యతో కలిసి వచ్చాడు. డాక్టర్లు పరీక్షంచి, కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు- నిర్ధారించారు. అప్పటికే ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉన్నా అస్పత్రిలో బెడ్లు లేని కారణంగా సిబ్బంది రోగిని అడ్మిట్‌ చేసుకోలేకపోయారు. దీంతో బాధితుడు అస్పత్రి ఆవరణలోనే ఓ చెట్టు- కింద పడుకున్నాడు. అందరూ చూస్తున్నారే తప్ప అతన్ని అస్పత్రిలో అడ్మిట్‌ చేసుకోలేదు. సుమారు నాలుగు గంటల పాటు- ఆ వృద్ధుడు మృతువుతో పోరాడి చివరకు అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలేశాడు. కళ్ల ఎదుటే వైద్యం అందక భర్త చనిపోవడంతో ఆ ఇల్లాలు గుండెలవిసేలా విలపించింది. ఆమె రోదన చూసి చుట్టుపక్కల వారి కళ్లు చెమర్చా యి. వ్యయ ప్రయాసలతో భర్త మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement