Saturday, April 20, 2024

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక నిర్వహణకు సిద్ధం:చిత్తూరు జిల్లా కలెక్టర్

తిరుపతిరూరల్ – ఈ నెల 17 న జరగనున్న తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నిక నిర్వహణ స్వేచ్చా యుత వాతా వరణం లో నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని 23-తిరుపతి పార్లమెంట్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ దినేష్ కుమార్ గిరిధర్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 23-తిరుపతి (ఎస్. సి) పార్లమెంట్ ఉప ఎన్నిక నిర్వహణ కు సంబందించి తిరుపతి ఆర్డీవో కార్యాలయం లోని సమావేశపు మందిరంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు యన్.హెచ్ ఆనంద కుమార్, రిటర్నింగ్ అధికారి మరియు నెల్లూరు కలెక్టర్ కె. వి.ఎస్ చక్రధర్ బాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, చిత్తూరు, తిరుపతి ఎస్.పి లు సెoధిల్ కుమార్,వెంకట అప్పలనాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్లు (అభివృద్ది,సంక్షేమం) వి. వీర బ్రహ్మo, రాజశేఖర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏ ఎస్ పి. నిశాంత్ రెడ్డి, తిరుపతి, శ్రీ కాళహస్తి, సత్యవేడు ఏ.ఆర్.ఓ లు అయిన చంద్రమౌళిశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, చంద్ర శేఖర్ లతో కలసి తిరుపతి ఉప ఎన్నిక నిర్వహణ పై సమీక్షా నిర్వహించారు.

ఈ సందర్భంగా జనరల్ అబ్జర్వర్ మాట్లాడుతూ ఈ నెల 17 న జరిగే తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల నిర్వహణ పూర్తి స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. తిరుపతి (ఎస్.సి) పార్లమెంటరీ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి మరియు నెల్లూరు జిల్లా కలెక్టర్ కె. వి.ఎస్. చక్రధర్ బాబు, మాట్లాడుతూ కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ 23 – తిరుపతి (ఎస్.సి) పార్లమెంటరీ ఉప ఎన్నిక నిర్వహణ జరగాలని, పోలింగ్ రోజున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి విధిగా మాస్క్ దరించి, క్యూ లైన్ లలో భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించేలా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు.. సెక్టోరియల్ అధికారులు విధిగా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి అవరసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వీడియోగ్రఫీ తప్పనిసరి అని తెలిపారు. పోలింగ్ నిర్వహణ పై పి ఓ లకు పూర్తిస్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఓటర్ స్లిప్పులు బి ఎల్ వో ల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఇందుకు సంబంధించి ఏర్పాటు అయినటు బృందాలు సమర్థ వంతంగా క్షేత్రస్థాయిలో పరి శీలన జరపాలని తెలిపారు.ఈ నెల17 న పోలింగ్ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు జరుగుతుందని ఈ విషయంపై ఓటర్లు కు అవగాహన కల్పించేలా ప్రతి పోలింగ్ కేంద్రం నందు ఈ విషయం ను ప్రదర్శిoచాలని తెలిపారు… డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నందు రిసెప్షన్, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధిత అంశాలకు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు…
చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.. హరినారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17న జరిగే తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని కోవిడ్ నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని, సమస్యాత్మక,అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు..
చిత్తూరు,తిరుపతి ఎస్.పి లు వారి పరిధిలో గల ప్రాంతాలలో సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో తీసుకుంటున్న చర్యలు అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి చేసిన వివరాలు జనరల్ అబ్జర్వర్ కి వివరించారు… ఈ సమీక్ష లో చిత్తూరు ఆర్డీవో రేణుకా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ లక్ష్మి ఇతర సంబంధింత అధికారులు పాల్గొన్నారు…..

Advertisement

తాజా వార్తలు

Advertisement