Friday, April 19, 2024

పేదల అభ్యున్నతే సీఎం జగన్ లక్ష్యం : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : పేదల అభ్యున్నతే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మూడో వార్డు కార్పొరేటర్ తమ్ముడు గణేష్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో భాగంగా గడపగడపను సందర్శించి పేరుపేరునా పలకరిస్తూ ఎమ్మెల్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధిని వివరించడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్య, దోమలు అమ్మ ఒడి, విద్యుత్ ట్రాన్స్ ఫారం ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. నవరత్నాల పథకాలే కాక ఇతర పథకాల ద్వారా అందరికీ ఇలాంటి చేకూర్చి వారి కుటుంబంలో వెలుగులు నింపుతున్నారన్నారు. మూడేళ్లలో అందించిన సంక్షేమ పథకాలు లబ్ధిని వివరించడం జరుగుతున్నది అన్నారు. అలాగే అమ్మ ఒడి , ఆసరా చేయూతతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలు ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నది అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాపరెడ్డి, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, నరసింహ, గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement