Thursday, April 25, 2024

మెగా లోక్ అదాల‌త్ పై స‌మీక్ష‌…

శ్రీకాళహస్తి – సుప్రీంకోర్టు, హైకోర్టు ,చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయ మూర్తి ఆదేశాల మేరకు ఈ నెల‌ 10 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ని విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మయూరం గురునాథ్ కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, “రాజీమార్గమే రాజ మార్గంగా” ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించనికి దోహద పడాలని కోరారు. స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో పోలీస్ అధికారులతో సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, లాక్ డౌన్,కోవిడ్ విస్తరణ నివారణ చర్యలో భాగంగా తగు జాగ్రతలతో మసులుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ. యస్.సి.రాఘవేంద్ర , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ.పల్లపోలు కోటేశ్వర రావు, శ్రీకాళహస్తి డి.ఎస్.పి. డి. విశ్వనాథం, 1వ,2 వ,పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాసులులు, శివరముడు,రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ ,బి.యన్.కండ్రిగ సర్కిల్ఇన్స్పెక్టర్ ఆరోహనారావు,ఏర్పేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి, రూరల్ మరియు తొట్టంబేడు సబ్-ఇన్స్పెక్టర్స్ వెంకటపతి , వెంకట సుబ్బయ్య,కోర్టు కానిస్టేబుల్స్ మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement