Tuesday, April 16, 2024

చంద్రబాబు పిచ్చోడు… రౌడీలా.. నారాయణస్వామి

తిరుపతి సిటీ : మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిచ్చోడని రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన‌ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాలో ఓటు అడిగే హక్కు చంద్రబాబు నాయుడుకి లేదన్నారు. మూడు రాజధానులు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాయలసీమలో, కోస్తా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదనే ఉద్దేశంతో ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని ఆకాంక్ష చంద్రబాబుకు లేదన్నారు. పేదవాళ్ల సంక్షేమం గురించి పట్టించుకోని వారు.. రౌడీ లాగా సభలు, సమావేశాలు పెట్టినప్పుడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, రాళ్లు విసిరించడం చేయడం సరికాదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల మన్న‌న‌ల్ని పొందలేక మానవత్వం మరిచిపోయి రౌడీలాగా ప్రవర్తిస్తూ ప్రజలు సిగ్గుపడేలాగా వైసీపీ నాయకులపై మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడును రాష్ట్ర ప్రజలు 2019లోనే రాజకీయ సమాధి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజలను రెచ్చగొడుతూ అల్ల క‌ల్లోలం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని వివరించారు.


పోలీస్ స్టేషన్లు దేవాలయాల లాగా ఉండాలని, అక్కడికి వచ్చి ఏదైనా సమస్యలు చెప్పుకునేటువంటి పేదవాళ్లకు న్యాయం జరిగేలా చూడాలని డీఎస్పీ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారికి న్యాయం జరిగేలా చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రజలకు భయం అనేది పోవాలని ఆ విధంగా పోలీస్ వ్యవస్థను తీసుకురావాలని ఎస్పీకి సూచించడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చి పేద ప్రజలకు విద్య అందించడం జరుగుతున్నదని వివరించారు. పేదవారు చదువుకుంటే కుల వ్యవస్థ కూడా నిర్మూలించేందుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాదయాత్ర నిజమైన పాదయాత్ర అని పేదల కష్టాలు కన్నీళ్లు తెలుసుకున్న వ్యక్తని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు పాదయాత్ర పేరుతో జనాన్ని రెచ్చగొట్టి రౌడీలాగా ప్రవర్తించడమే తప్ప ఆయన చేసేది ఏమీ లేదని పేర్కొన్నారు. నవరత్నాలు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదవాళ్లను ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతగానో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరిగిందని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అర్హుడు కాదని, రాజకీయ నాయకుడు అంటే ప్రజల అభిమానాన్ని ఆకట్టుకునే విధంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement