Monday, December 9, 2024

కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి బ్యారేజ్ నిర్మించండి : బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

తిరుపతి సిటీ : కృష్ణా నదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి, బ్యారేజ్ నిర్మించాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఓ ప్రైవేట్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రాయలసీమ ప్రాంతాన్ని సీఎం ఏమి అభివృద్ధి చేశారు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ ఎమ్మెల్యేలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ ప్రాంతాలను చిత్రీకరించడం బాధాకరమన్నారు. అలాగే రాయలసీమను కించపరుస్తూ సినిమాలు తీయడంతో పాటు సినిమా రంగం రాయలసీమ ప్రాంతం ప్రాముఖ్యతను దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అవసరం లేదని విశాఖ పరిపాలన రాజధాని అవసరం లేదని ప్రజలే చెప్తున్నారు అని తెలియజేశారు. రాయలసీమ ప్రాంతం తీవ్ర అన్యాయానికి గురైంది అన్నారు ఈ ప్రాంతంలో తీవ్రంగా కరువుతో తాండవిస్తున్నదని తెలిపారు. సినిమా పరిశ్రమ ఈ ప్రాంతం ఫ్యాక్షనిస్టు లాగా చిత్రీకరించడంతో ఈ ప్రాంతంలో పిల్లలకు పెళ్లయ్యేది కూడా ఇబ్బందికరంగా మారుతున్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. అమర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement