Friday, April 26, 2024

దేశ అభివృద్ధి కోసమే బీజేపీ ఆవిర్భావం – సోము వీర్రాజు

తిరుపతి – భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఏర్పడినదే భారతీయ జనతా పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. మంగళవారం లోని బిజెపి జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1980 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారని తెలిపారు. రాజకీయాలు అవినీతి మయం అయినప్పుడు ఆ రోజుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలి అనుకున్నారన్నారు. బురదలో ఉద్భవించిన కమలాన్ని దేశ రాజకీయాలలో ఒక కళా కాంతి ఇవ్వడానికి పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ఒక బ్రహ్మచారి వాజ్పాయి, దీర్ఘకాల కుటుంబ వ్యవస్థ అయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనకు స్వస్తి పలికిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు మోడీని రెండుసార్లు ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నట్లు తెలిపారు. రాజకీయాలలో దేశవ్యాప్తంగా కుటుంబాల పాలన వ్యవస్థ అంతమొందించడానికి బిజెపి ఆవిర్భవించినట్లు మరోసారి గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్ బీహార్ ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే కుటుంబ పాలన వ్యవస్థ పూర్తిగా నశించిపోయింది అన్నారు. అవినీతి గడ్డి కుంభకోణం వంటి విషయాల్లో ఉన్న వ్యక్తులను జైలుకు తరలించి రోజులు దగ్గర పడ్డాయి అన్నారు.
భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన ఏ నాయకుడు కూడా అవినీతికి పాల్పడకుండా కుటుంబాన్ని దూరంగా పెట్టి ప్రజాసేవకు అంకితం అయినవారునట్టు తెలిపారు. దేశం లో ఇంకా కొనసాగుతున్న వారసత్వ కుటుంబ పాలన దూరం చేయడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు దేశంలోని ఇంకా అనేక రాష్ట్రాలలో ఈ కుటుంబ పాలన వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది దీనిపైన కూడా బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రూ. 26 వేల కోట్లతో రైల్వేలను లక్షల కోట్లతో రహదారులను తిరుపతిలో 50 వేల కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర నిధులతో జరుగుతున్నాయి అన్నారు ఇది బిజెపి యొక్క నిరంతర కార్యక్రమం ప్రజల డబ్బును సద్వినియోగం చేయాలని బిజెపి ముఖ్య ఉద్దేశం అన్నారు దేశంలో ఏ విధమైన అభివృద్ధి జరిగినా, అది ప్రైవేటైజేషన్ కావచ్చు మరొకటి కావచ్చు దేశ ప్రజల డబ్బును సద్వినియోగం చేయడమే బిజెపి ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రైవేటైజేషన్ బిజెపి తీసుకున్న నిర్ణయం కాదు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ దేశ అభివృద్ధి మన లక్ష్యం ప్రపంచ దేశాలలో దీటుగా అమెరికా ను తలదన్నే విధంగా దేశ అభివృద్ధి చేయడమే బిజెపి లక్ష్యం మని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది అన్నారు. ఈ ప్రాంతంలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థి ఎంపీగా అయితే ఆ నిధులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుగా ఆయన బిజెపి పతాకాన్ని ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, గుడిసె దేవానంద్ ,షేక్ బాజీ,డాక్టర్ పార్థసారథి బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు విశ్వనాధ్, వరప్రసాద్, ఉమాపతి ,ఆనంద రెడ్డి , పొనగంటి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement