Tuesday, April 23, 2024

సుగుటూరు గంగమ్మ జాతరను పటిష్టంగా నిర్వహిస్తాం – కమిషనర్ కె.ఎల్.వర్మ

పుంగనూరు పట్టణంలో మంగళవారం, బుధవారం అత్యంత వైభవంగా జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ కెఎల్‌.వర్మ తెలిపారు. సోమవారం చైర్మన్‌ అలీమ్‌బాషా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగభూషణం, జమీందారులు సోమశేఖర్‌చిక్కరాయల్‌, మల్లికార్జునచిక్కరాయల్‌తో కలసి ప్యాలెస్‌ ఆవరణాన్ని అయినా పరిశీలించారు. ఈ జాతరలో సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండ ఉండేందుకు విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశారు. ప్యాలెస్‌ ఆవరణంలో బ్యారీకేడ్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులను బట్టి విందులు, వినోదాలను నిషేధించామన్నారు.ప్రజలు సాధ్యమైనంత వరకు అమ్మవారి దర్శనం కోసం ఆలయం వద్దకు రాకుండా కెసిటివి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక్ష ప్రసారాలను ఇంటివద్దనుండే వీక్షించాలని కోరారు. పట్టణంలో చలివేంద్రాలు, వైద్యశిబిరాలతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపడుతామన్నారు. పట్టణంలో అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, విద్యుత్‌ అంతరాయం లేకుండ ప్రత్యేక విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోనికి బస్సులు,కార్లను మాత్రం మినహాయించి, పెద్ద వాహనాల రాకపోకలను బైపాస్‌రోడ్డుకు మళ్లీంచామన్నారు. డిఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు కలసి సుమారు 200 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్రతో పాటు కౌన్సిలర్లు అమ్ము, జెపి యాదవ్‌, కాళిదాసు, నటరాజ, నయీంతాజ్‌, జె.ఎన్ సి నరసింహులు,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement