Saturday, April 20, 2024

7కొత్త మొబైల్ మెడికల్ 104 వాహనాల ప్రారంభం

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా పేదవారికి కూడా ఆధునిక వైద్యం ఉచితంగా అందించే క్రమంలో జిల్లా కు అదనంగా 7మొబైల్ మెడికల్ యూనిట్ల 104 అంబులెన్సు లకు సోమవారం ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం ఉన్న 32 వాహనాలకు తోడుగా అదనంగా నేడు అందిన మరో 7కొత్త 104 వాహనాలను తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణారెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నగర మేయర్ శిరీష లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా జిల్లాలోని 436 విలేజ్ హెల్త్ క్లినిక్ ల పరిధిలోని, ప్రతి సచివాలయ పరిధిలో నెలకు రెండుసార్లు 104 వాహనాలు పర్యటించి వైద్య సేవలు అందిస్తున్నాయని తెలిపారు.

పి హెచ్ సి కి చెందిన ఒక డాక్టర్ 104 వాహనంతో వెళ్లి గ్రామంలోని విలేజ్ హెల్త్ క్లినిక్ వద్ద ఉదయం ఓ పి నిర్వహించి, పరీక్షలు చేపట్టి మందులు అందిస్తారని తెలిపారు. మధ్యాహ్నం డాక్టర్ పాఠశాలలు, అంగన్వాడీలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారని, ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సలు పొంది ఇంటివద్దకే పరిమితమైన పేషంట్లకు, వయో భారంతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి ఇంటి వద్దే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీహరి, 104 జిల్లా కోఆర్డినేటర్ శేషశయనా రెడ్డి, డాక్టర్ ఛత్ర ప్రకాష్, ఎంఎల్ హెచ్ పీ లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అర్బన్ పిహెచ్ సి డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement