Thursday, April 18, 2024

ఆముదం గింజలు తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత

చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వెంకటగిరి మండలం కంబార్లపల్లి గ్రామంలో అడవి ఆముదాల గింజలు తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం ఆటలు ఆడుకుంటూ గ్రామ సమీపంలోని అడవి ఆముదాల గింజలు తిన్నారు.

అయితే విద్యార్థులు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు, విరోచనాలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో వాళ్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెంది వెంటనే వారిని వెంకటగిరి మండల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా ప్రస్తుతం పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారి ఆరోగ్యంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement