Wednesday, April 24, 2024

కిడ్నాప్ హ‌త్య కేసులో 11 మందికి జీవిత ఖైదు…

చిత్తూరు, : 2016లో జరిగిన ఒక గ్రానైట్‌ వ్యాపారి కిడ్నాప్‌, దోపిడి, హత్య కేసుపై శుక్రవారం చిత్తూరు న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. 2016 జనవరి ఒకటిన యాదమరి మండలం గొండి వాళ్ల ఊరుకు చెందిన గ్రానైట్‌ వ్యాపారి బజలింగం పై కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా వ్యవహరించి పరదరమి- యాద మరి రహదారిలో కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. 50 లక్షల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు- ఈ విషయంపై అప్పటి సి ఐ ఆదినారాయణ, ఎస్‌ఐ రఘుపతి 14 మందిపై కేసు నమోదు చేశారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హిమబిందు వాదనతో ఏకీభవించిన చిత్తూరు 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి.వి.ఎస్‌. సూర్యనారాయణ రావు శుక్రవారం తీర్పును వెలువ రించారు. 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ, ఒక వ్యక్తికి పది సంవత్సరాల శిక్ష అమలు చేస్తూ తీర్పును ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు మహిళలను విడుదల చేశారు.
10 మందికి జీవిత ఖైదు
2016లో ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా కిడ్నాప్‌ చేసి దోపిడీకి పాల్పడిన కేసులో చిత్తూరు న్యాయస్థానం బంగారుపాలెం మండలం చెందిన ముటు-కూరు హేమ చంద్ర (కొత్త వెంకటాపురం), కుతాడి భరత్‌కుమార్‌ రెడ్డి(దండువారిపల్లి), దేవల రాజేష్‌ (తంబుగానిపల్లి), తగిరి దొరబాబు (తంబుగానిపల్లి), నందకుమార్‌ (తంబుగానిపల్లి), పుల్లూరు మురళి (తంబుగానిపల్లి), రాజశేఖర్‌ (తంబుగానిపల్లి), అన్నంగి నరేష్‌ (తంబుగానిపల్లి), వాయల్పాడుకు చెందిన చింతపర్తి భరత్‌ కుమార్‌, పీలేరుకు చెందిన గుడ్లూరు విజయకుమార్‌, యాద మరి మండలం చెందిన హేమాద్రి అనంతపురం జిల్లా ఎల్‌ఐసీ కాలనీ, (జె.ఎన్‌.టి.యు)కు చెందిన అవసాని సుదర్శన్‌పై న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షణ అమలు చేసింది. ఈ కేసుకు సంబంధించి దేవాల రాణమ్మ అలియాస్‌ రాణి, దేవాల చిన్నమ్మలను కోర్టు విడుదల చేసింది.
దేవాళ్ల రాజేష్‌పై 15 కేసులు..
ఒకటో నంబర్‌ ముద్దాయి అయిన దేవాళ్ల రాజేష్‌ అలియాస్‌ బంగి అను అతని పై గతంలో కూడా చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్లలో 15 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం కూడా దేవాళ్ల రాజేష్‌ అలియాస్‌ బంగి పై దొంగతనానికి సంబంధించి యాదమరి పోలీస్‌ స్టేషన్‌లో ఈస.nు 152/2014, పలమనేరు పోలీస్‌ స్టేషన్‌లో ఈస.nు 84/2015, ఎర్ర చందనం దొంగతనానికి సంబంధించి పెనుమూరు పోలీస్‌స్టేషన్‌లో ఈస.nు 8/2016, తవణంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈస.nు 9/2016, కాణిపాకం పోలీస్‌స్టేషన్‌లో ఈస.nు 2/2016, చిత్తూరు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఈస.nు 7/2016 కేసులు విచారణలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement