Friday, March 29, 2024

చిత్తూరు మేయర్ ఎంపికలో మారుతున్న రాజకీయ సమీకరణలు

చిత్తూరు – చిత్తూరు మేయర్ ఎంపికలో ఒక్కసారిగా రాజకీయ వేడెక్కింది . తెరపైకి కొత్త పేర్లు రావడంతో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో వైరి వర్గాల వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మేయర్ ఎంపికలోనే అధిష్టానం పరిశీలనలో నలుగురి పేర్లు ఉండగా.. డిప్యూటీ మేయర్ ల‌ కి సైతం పోటాపోటీగా పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చింది. చిత్తూరు నగరంలో మొత్తం యాభై డివిజన్లు ఉండగా 46 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది . మిగిలిన నాలుగు స్థానాల్లో మూడు టిడిపి , ఒక డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో మేయర్ పదవిని వైసిపి చేజిక్కించుకుంది. చిత్తూరు మేయర్ పదవి ఎస్సీ జనరల్ కు కేటాయించారు. మొత్తం ఎనిమిది ఎస్సీ డివిజన్లలో 5 డివిజన్లు వైసిపి గెలుపొందగా రెండు టిడిపి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. అయిదు డివిజన్లలో సమాజ అభ్యర్థుల్లో ఇదివరకే జిల్లాకు చెందిన వైసిపి నేతలు బుల్లెట్ సురేష్ , విజయానంద రెడ్డి లు 24 వ డివిజన్ గెలుపొందిన పూమని పేరును మంత్రి పెద్దిరెడ్డి వద్ద మేయర్గా ఎంపిక చేయాలంటూ 27 మంది కార్పొరేటర్లను వెంటబెట్టుకుని కలిశారు. దీంతో వీరి విజ్ఞప్తిని మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు 8వ డివిజన్ అభ్యర్థి షర్మిల , 13 వ డివిజన్ కార్పొరేటర్ బాబు ల పేర్లను మేయర్గా ఎంపిక చేయాలంటూ మంత్రి పెద్దిరెడ్డికి నివేదిక ద్వారా పంపారు. దీంతో మేయర్ పేరు పరిశీలనలో పూమని , షర్మిల , బాబుల పేర్లు ప్రస్తావనకు వచ్చింది. అయితే తాజాగా మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే 39 వ డివిజన్ కార్పొరేటర్ ఆముద పేరును పార్టీ అధిష్టానానికి మేయర్గా ఎంపిక చేయాలంటూ పంపారు పంపినట్లు సమాచారం. దీంతో మళ్లీ మేయర్ పేర్లు పరిశీలనలో తెరపైకి నలుగురి పేర్లు వచ్చాయి అధికారికంగా మంత్రి పెద్దిరెడ్డి చిత్తూరు మేయర్ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశముంది.

డిప్యూటీ మేయర్ రేసులో పలువురు

చిత్తూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ రేసులో పలువురు ఆశావాహులు ఉన్నారు. ఆశావాహుల్లో తొలినుంచి 16 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. చంద్రశేఖర్ పేరు ప్రస్తావన ఉంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిప్యూటీ మేయర్ లను ఇద్దరు నియమిస్తామని ప్రకటించడంతో కొంతమంది ఆశావహుల పేర్లు తెరపైకి వచ్చింది. ఆర్ చంద్రశేఖర్ బిసి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రెండవ డిప్యూటీ మేయర్ పదవి కోసం మైనార్టీ వర్గం నుంచి హుస్సేన్ ఆలీషా సయ్యద్ సర్దార్ పేర్లు పరిశీలనలో ఉంది. అలాగే రెడ్డి సామాజికవర్గం నుంచి హరిణి రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉంది. అలాగే మరో మహిళా కార్పోరేటర్ ఇందూ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ బుధవారం మేయర్ , డిప్యూటీ మేయర్ల పేర్లను పార్టీ అధిష్టానం ప్రకటించనున్నట్లు సమాచారం .

Advertisement

తాజా వార్తలు

Advertisement