Friday, December 6, 2024

తిరుమల హుండీలో పాకిస్థాన్ కరెన్సీపై టీటీడీ ఈవో స్పందన

తిరుమలలో టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన లేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైనట్టు నివేదికలు ఉన్నాయని.. అందుకే దర్శనాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి హుండీలో పాకిస్తాన్ కరెన్సీ కూడా ఉందన్న వార్తలపై ఈవో స్పందించారు. పాకిస్తాన్ కరెన్సీ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

దేశీయ ఆవులతో నెయ్యిని తయారు చేసి స్వామివారి నైవేద్యాలకు, దీపారాధనకు వినియోగిస్తామన్నారు. తిరుమలలోనే దేశీయ ఆవు నెయ్యి తయారు చేస్తామని పేర్కొన్నారు. త్వరలోనే ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో అగరబత్తీలు తయారు చేసి విక్రయించడానికి టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. అగరబత్తీల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగిస్తామని టీటీడీ ఈవో తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: చిత్తూరు జిల్లాలో కంపించిన భూమి

Advertisement

తాజా వార్తలు

Advertisement