Friday, March 29, 2024

చంద్ర‌బాబుకు బ‌ర్త్ డే విషెష్‌ తెలిపిన చిరంజీవి

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈరోజు. నేటితో చంద్ర‌బాబు73వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చంద్రబాబు జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు నాయకులు. కేక్ కటింగ్, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదానాలతో పాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. అన్ని పార్టీల నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ” శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని ట్విట్ చేశారు చిరంజీవి.

Advertisement

తాజా వార్తలు

Advertisement