ఢిల్లీ – రిపబ్లిక్ డే సందర్భంగా పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ అత్యున్నత పురస్కారాలకు కేంద్రం ఎంపిక చేసింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి. తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక విభాగంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి; కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణిని పద్మశ్రీ వరించింది.
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా(సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంల); హనుమంతరావు పసుపులేటి(వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు)గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర; అబ్బారెడ్డి నాగేశ్వరరావు; (సైన్స్ అండ్ ఇంజినీరింగ్); సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్); ;సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ); ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగంలో) లు ఉన్నారు