Friday, January 27, 2023

Tirumala | శ్రీ‌వారి బ్రేక్ దర్శన వేళ‌ల్లో మార్పు.. ప్రయోగాత్మకంగా చేప‌డుతున్న‌ టీటీడీ

తిరుమల (ప్ర‌భ న్యూస్‌) : తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్టు టీటీడీ తెలియజేసింది. ఈమేర‌కు స్వామివారి ద‌ర్శ‌న వేళ‌ల‌ను ప్రయోగాత్మకంగా మారుస్తున్నట్టు తెలిపింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రివేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు అధికారులు తెలిపారు. ఈ కారణంగా భక్తులు ఏరోజుకారోజు తిరుపతి నుండి తిరుమలకు చేరుకుని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తద్వారా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
   

నవంబరు 30న మాధవంలో శ్రీవాణి ట్రస్టు దాతలకు కౌంటర్ ప్రారంభం
శ్రీవాణి ట్రస్టు దాతల కోసం తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో బుధవారం ఉదయం 10 గంటలకు టికెట్ కౌంటర్ ప్రారంభించనున్నారు. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ దాతలకు ఇక్కడే ఆఫ్ లైన్ టికెట్లు కేటాయిస్తారు. గదులు కూడా ఇక్కడే మంజూరు చేస్తార‌ని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement