Thursday, November 28, 2024

Srisailam : దేవస్థానం ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్ ఆజాద్

శ్రీశైలం : శ్రీశైల దేవస్థానానికి ప్రత్యేక అధికారిగా ఎస్‌ఎస్‌ చంద్రశేఖర ఆజాద్‌ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు బదిలీ కావడంతో దేవస్థాన సహాయ కమిషనర్‌ ఇ.చంద్రశేఖరరెడ్డికి ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ ఈఓ బాధ్యతలు అప్పగించింది.

అయితే ప్రస్తుతం శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తుండడంతో వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్ ఆజాద్ ను నియమించారు. ఆజాద్ దేవాదాయశాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌గా ప్రస్తుతం పనిచేస్తుండడం గమనార్హం. ఇక శ్రీశైలంలో ఈనెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కూడా దేవాదాయశాఖ శ్రీశైలంకు ప్రత్యేక అధికారిని నియమించడం విశేషం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement