Thursday, December 5, 2024

AP | చంద్రబాబు కృషితోనే ఐటీ రంగంలో అద్భుత ఫలితాలు.. లోకేష్

  • విదేశాల్లో ఉన్న‌త స్థానాల్లో మ‌న వాళ్లు
  • విద్యార్ధులు ప్ర‌తి విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకోవాలి
  • విజ‌యం సాధించాలంటే ప‌ట్టుద‌ల‌, క‌ఠిన ప‌రిశ్ర‌మ అవ‌సరం
  • విట్ విద్యార్ధుల‌కు నారా లోకేష్ హిత‌వు


అమరావతి: ఐటీ రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి వల్లే అద్భుత ఫలితాలు వచ్చాయ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్.. ఆయ‌న ఇచ్చిన స్పూర్తితోనే మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నార‌ని పేర్కొన్నారు. అమరావతిలోని విట్‌ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్య ప్రదర్శనను ఆయ‌న నేడు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… ముందు చూపుతో త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల విదేశాల్లో ఇప్పుడు మన తెలుగు వాళ్లు మంచి స్థానాల్లో ఉన్నార‌న్నారు. అంతర్జాతీయ కంపెనీల్లో తెలుగువాళ్లు అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. గెలవడం కోసం నిలబడాలన్న మాటను విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల‌ని కోరారు. అంతర్జాతీయ పరిణామాల గురించి అవగాహన పెంపొందించుకోవాల‌ని కోరారు. రాబోయే 25ఏళ్లలో ఇండియా మరింత అభివృద్ధి చెందనుంద‌ని చెప్పారు. వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామ‌ని, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదిగేందుకు అవకాశం ఉందని లోకేశ్‌ తెలిపారు.

ఉన్నత విద్య కోసం తాను కూడా విదేశాలకు వెళ్లి వచ్చానని అంటూ మనకు, విదేశాల్లో ఉన్నత విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. విదేశాల్లో పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు ఉండరని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement