Thursday, April 25, 2024

రేపు చంద్రబాబు పుట్టినరోజు.. టీడీపీ ఆఫీసులో నిరాడంబ‌రంగా నిర్వహణకు ఏర్పాట్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలను నిరాడంభరంగా పార్టీ కార్యాలయంలో జరుపుకొనున్నారు. బుధవారం పుట్టినరోజు అయినప్పటికీ నేతలతో, కార్యకర్తలతో ఆయన పార్టీ కార్యాలయంలోనే అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ చంద్రబాబు పార్టీ కార్యాలయంలోనే గడపనున్నారు.

అడవినెక్కలంకు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నూజివీడు నియోజకవర్గం పరిధిలోని అడవినెక్కలంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన అడవినెక్కలం చేరుకుంటారు. స్ధానిక నేతలు చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను అడవినెక్కలంలో నిర్వహించనున్నారు. ఆతర్వాత అక్కడే ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో ముఖాముఖి కానున్నారు. ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement