Wednesday, November 27, 2024

AP | కొర్లాం విద్యుత్ సబ్ స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించిన చంద్ర‌బాబు

ఇచ్ఛాపురం : సోంపేట మండలం కొర్లాo 132/33 విద్యుత్ సబ్ స్టేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. ఈ స‌బ్ స్టేష‌న్ కు అంచనా వ్యయం రూ. 54.22 కోట్లు. గుంటూరు జిల్లా వేదిక పై నుండి ఈ కార్యక్రమం నిర్వహించగా ఇచ్చాపురం సబ్ స్టేషన్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ , ఎమ్మెల్యే బెందాళం అశోక్ , ఎమ్మెల్సీ నర్తు రామారావు , విద్యుత్ శాఖ ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఇచ్ఛాపురంలో ఎమ్మెల్యే అశోక్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మంత్రులు హాజరు కాలేదా.. ప్రశ్నించిన చంద్రబాబు
ఇచ్ఛాపురం : విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనలేదా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను ప్రశ్నించారు. మంత్రులకు మీరు సమాచారం ఇవ్వలేదా అంటూ ప్రశ్నించారు. సమాచారం ఇచ్చామని, విజయవాడలో వున్నారని కలెక్టర్ సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి ఢిల్లీలో వున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ వారు వర్చువల్ గా కనెక్ట్ కావొచ్చని, ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో ఎవరూ తప్పించుకోరాదన్నారు. అందులో మీరు భాగస్వాములను చేయాలని కలెక్టర్ ను ఉద్దేశించి అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement