Tuesday, April 16, 2024

ఆయన రాష్ట్రం కోసం.. ఆమె ఆయన కోసం.. చంద్రబాబు వైరల్ వీడియో!

టీడీపీ అధినేత చంద్రబాబు జూమ్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఏపీలో కరోనా పరిస్థితులపై చంద్రబాబు పొలిట్ బ్యూరోలో చర్చించారు. తాజా పరిణామాలు, ప్రభుత్వ చర్యలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం జరిగింది. చంద్రబాబు జూమ్‌ కాల్‌ లో బిజీగా ఉన్న సమయంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉన్నట్టుండి చంద్రబాబు ఉన్న గదిలోకి డోర్ తీసుకుని వచ్చారు. సమావేశం కొనసాగుతుండగానే.. ఓ ప్లేట్‌ లో స్నాక్స్ తీసుకొచ్చారు. టేబుల్‌ పై పెట్టి వెంటనే వెళ్లిపోయారు. ఈ వీడియోను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారని.. ఆయన భార్య భువనేశ్వరి భర్త ఎంత బిజీగా ఉన్నా సరే ఆయన బాగోగులు చూసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement