Tuesday, October 15, 2024

రజనీకాంత్‌ను పరామర్శించిన చంద్రబాబు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్యంతో బాధపడతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, రజనీకాంత్‌కు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య ప‌రిస్తితి అడిగి తెలుసుకున్న చంద్ర‌బాబు.. రజినీకాంత్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాక్షించారు.

కాగా, వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు…. గుండె నుంచి రక్త ప్రసరణ అయ్యే నాళాల్లో వాపు గుర్తించి నాన్‌ సర్జికల్‌ పద్ధతుల్లో స్టెంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు రోజుల్లో డిశ్ఛార్జి అవుతారని అపోలో ఆస్పత్రి వర్గాలు బులెటిన్లో వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement