Friday, April 26, 2024

ఎమ్మెల్యే గోరంట్లకు చంద్రబాబు ఫోన్!

టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆ పార్టీకి రాజీనామా చేస్తారని వస్తున్న ప్రచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సైతం బుచ్చయ్య చౌదరికి ఫోన్‌ చేసి మాట్లాడారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరి పార్టీకి రాజీనామా చేస్తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీకి రాజీనామా విషయంపై స్పందించేందుకు ఎమ్మెల్యే గోరంట్ల నిరాకరించారు. ఈ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. అదే సమయంలో పార్టీ సీనియర్‌ నేతలు, ఆయన అనుచరులు గోరంట్లతో ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు. 

అనుబంధ కమిటీల నియామకం, జిల్లాలో స్థానిక నేతల తీరుపై కొంత కాలంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసంతృప్తితో ఉన్నారు. అనుబంధ కమిటీల్లో నియామకానికి సంబంధించి ఇటీవల గోరంట్ల సిఫారసు చేసిన పేర్లకు అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదనే చర్చ ఆయన్ను మరింత కలత చెందేలా చేసిందని సమాచారం. కాగా, టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు బుచ్చయ్య చౌదరి. ఇప్పటి వరకు 6 సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈ వార్త కూడా చదవండిః కేంద్రం అలా చేస్తే పెట్రోల్ రూ.32 కే వస్తుందట..

Advertisement

తాజా వార్తలు

Advertisement