Saturday, October 12, 2024

పేదల ఇళ్లపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు.. మంత్రి మేరుగ‌

పేదల ఇళ్లను అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అని ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… అమరావతిలో రైతులను చంద్రబాబు నిలువునా ముంచారని, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ అయిపోయాడంటూ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. కోర్టుల్లో ఓడిపోయినా చంద్రబాబుకు సిగ్గులేదని ధ్వజమెత్తారు.

51 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే ఒక చరిత్ర అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ధర్నాలు చేస్తారా ?. డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేయిస్తున్నాడు. చంద్రబాబు ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నాడు ?. రాజధానిలో పేదలు ఉండకూడదని చంద్రబాబు కుట్రలు పన్నాడన్నారు. సామాజిక సమతుల్యత ఏర్పడుతుందంటూ అడ్డుపడ్డారని, పేదలకు ఎక్కడ లాభం చేకూరుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement