Thursday, December 5, 2024

AP | మ‌త‌స్వామ‌ర‌స్యాన్నికాపాడే నాయ‌కుడు చంద్రబాబు మాత్రమే : ఎంపి కేశినేని

భ‌వానీపురం, (ఆంధ్రప్రభ) : పార్ల‌మెంట్ లో వ‌క్ఫ్ బోర్డ్ స‌వ‌ర‌ణ చ‌ట్టం జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీకి పంపించాల‌ని సూచించింది తెలుగుదేశంపార్టీ. ఈ బిల్లు విష‌యంలో జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీ ఏర్ప‌డ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కృషి, టిడిపి తీసుకున్న నిర్ణ‌యం. సీఎం చంద్ర‌బాబు మ‌త‌స్వామ‌ర‌స్యాన్నికాపాడే నాయ‌కుడని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

పశ్చిమ నియోజకవర్గం భవానిపురం ఈద్గా మైదానంలో ఆదివారం జమాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన‌ వక్ఫ్ పరిరక్షణ మహాసభ కార్యక్రమానికి ఎంపి కేశినేని శివ‌నాథ్ , నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వర రావు , శాసనమండలి మాజీ చైర్మన్ మహమ్మద్ షరీఫ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ…

వక్ఫ్ సవరణ చట్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకషంగా అన్ని ముస్లిం జమాతులతో మాట్లాడి తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ముస్లిం సమాజ అభిష్టానికి వ్యతిరేకంగా పనిచేయదు.చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.సీయం చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజం అభివృద్ధి కోసం, వక్ఫ్ ఆస్తులు ఏ విధంగా కాపాడాలి అని నిరంతరం ఆలోచిస్తారన్నారు.

ఈ కార్యక్రమంలో జామాఅతే ఇస్లామీ హింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లా హుస్సైనీ , జామాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అబ్దుల్ రఫీక్ , టిడిపి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతవుల్లా , టిడిపి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.ఎస్. బేగ్ , జామాఅతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ , ముస్లిం ప్రధాన సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement