Thursday, July 29, 2021

ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన?

జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11 శాతం డిఎ ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. పీఆర్సీ ఊసేలేదన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదని మండిపడ్డారు. కరోనా విపత్తు సమయంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ సాచివేత ధోరణి సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News