Monday, October 14, 2024

AP: ఘనంగా స్వర్గీయ పరిటాల రవీంద్ర జయంతి వేడుకలు..

దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. పరిటాల ఘాట్ వద్ద పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో పాటు వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పరిటాల జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

పరిటాల రవీంద్ర సోదరి ఉష ఘాట్ వద్ద మిఠాయిల పంపిణీ చేసి, అన్నదానం చేశారు. పరిటాల రవీంద్ర మెమొరియల్ ట్రస్ట్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గంగంపల్లి రెసిడెన్సియల్ స్కూల్ సెంటర్ వద్ద గరుత్మంతుని విగ్రహాన్ని ప్రారంభించారు.

ఎంజేపీ రెసిడెన్సియల్ స్కూల్ విద్యార్థులకు 600 స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ రామమూర్తినాయుడు రూ.50వేల వ్యయంతో త్రాగునీటి ఫ్రిజ్ ను అందజేశారు. మాజీ ఎంపీపీ రంగయ్య సొంత నిధులతో స్పోర్ట్స్ మెటీరియల్ ను పంపిణీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement