Saturday, April 20, 2024

వివేకా కేసులో విచారణ ముమ్మరం… సీబీఐ చేతిలో కీలక సమాచారం?

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా గత 25 రోజున అధికారులు పలువురిని విచారిస్తున్నారు. పులివెందులలోనూ  సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు. అయితే ఈ కేసును విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త అనుమానితులు తెరపైకి వస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు పులివెందులకు చెందిన ఉమామహేశ్వర్​తో పాటు సింహాద్రిపురం మండలం సుంకేశులకు చెందిన జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. జగదీశ్వర్ రెడ్డి గతంలో వివేకా పొలం పనులను చూసుకునేవారు. ఇటీవల జగదీశ్వర్​ను సీబీఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర‌ గంగిరెడ్డితో పాటు కారు మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ఇద‌య‌తుల్లా, ఆయ‌న‌కు సన్నిహితంగా ఉండే కిరణ్‌ కుమార్ యాద‌వ్‌, సునీల్‌ కుమార్ యాద‌వ్‌ ల‌తో పాటు మ‌రికొందరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

కాగా, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి అయిన వివేకా 2019 అసెంబ్లీ ఎన్నికలు కొద్ది రోజులు మందు దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: ప్రధాని మోదీకి జగన్ లేఖ

Advertisement

తాజా వార్తలు

Advertisement