Tuesday, April 16, 2024

వివేకా హత్య కేసు: పదో రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో ప‌దో రోజు విచార‌ణ కొనసాగిస్తోంది. బుధవారం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి ముగ్గురు అనుమానితులను పిలిపించి విచారిస్తున్నారు. చిట్వేలి మండ‌లానికి చెందిన వైసీపీ నేత‌లు ల‌క్ష్మీక‌ర్, ర‌మ‌ణను, సింహాద్రిపురం మండ‌లం సుంకేశులకు చెందిన జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో వివేకాకు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి పీఏగా ప‌నిచేశారు. ఇప్ప‌టికే వివేక హ‌త్య కేసులో అనుమానితుడిగా వైసీపీ కార్య‌క‌ర్త‌ కిర‌ణ్ కుమార్ యాద‌వ్ ను సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. అలాగే, వివేక ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా ప‌నిచేసిన ఇద‌య‌తుల్లాను కూడా విచారించి ప‌లు వివ‌రాలు తీసుకున్నారు.

కాగా, వివేకా హత్య కేసు కొంత కాలం విరామం తర్వాత జూన్ 7వ తేదీ నుంచి మళ్లీ విచారణ మొదలైంది. కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైల్‌లో ఉన్న గెస్ట్‌ హౌస్‌లో ఈ విచారణ జరుగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికీ కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ… ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement