Friday, October 4, 2024

AP | ఏఆర్‌ డెయిరీపై కేసు.. ముందస్తు బెయిల్ కు పిటిషన్ !

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ ఫిర్యాదు మేరకు ఏఆర్ డెయిరీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

వివరణ తీసుకోకుండా కేసు నమోదు చేయడం సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సహా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోరారు. బెయిల్ మంజూరుపై ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని, కేసు దర్యాప్తునకు సహకరిస్తానని పిటిషన్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement