Thursday, April 18, 2024

గుట్కా తయారీకి కేరాఫ్‌ కృష్ణా, గుంటూరు.. రోజుకు రూ. 15 కోట్ల వ్యాపారం

ఎన్‌టీఆర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : నిషేధిత గుట్కా రాకెట్‌కు రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు అడ్డాగా మారాయి. తయారీ నుంచి మార్కెటింగ్‌ వరకు అంతా పక్కాగా సాగిపోతోంది. నెలకు రూ. 15 కోట్ల మేర వ్యాపారం యధేచ్చగా జరుగుతున్నా అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడంలేదు. ఎందుకంటే గుట్కా రాకెట్‌కు సూత్రదారులు అధికార పార్టీ అనుచరులే కాబట్టి అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

నెలకు రూ. 15 కోట్ల అక్రమ వ్యాపారం..

ఏదో గుట్కా వ్యాపారమని తేలిగ్గా తీసేయకండి. ఎందుకంటే రాజధాని గ్రామాల కేంద్రంగా నెలకు రూ.15 కోట్ల వ్యాపారం సాగుతోంది. ఒక్కోప్యాకెట్‌ రూ.10 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే రోజుకు రూ.10 లక్షల వ్యాపారం నడుస్తోంది. ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకు రోజుకు రూ.40 లక్షల వరకు గుట్కాప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్నారు. అంటే రోజుకు రూ.50 లక్షల టర్నోవర్‌. ఆ లెక్కన నెలకు రూ.15 కోట్ల వరకు గుట్కా అక్రమ వ్యాపారం అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది.

అధికార యంత్రాంగం ఉదాసీనత..

రాజధాని కేద్రంగా వ్యవస్ధీకృతమైన గుట్కా రాకెట్‌పై అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు అక్రమంగా నిల్వచేసిన గుట్కా చిరువ్యాపారులపై దాడులు నిర్వహిస్తున్నారు. అయితే సిండికేట్‌ల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రాజధాని గ్రామాల్లోనే గుట్కా యూనిట్లు ఉన్నాయని తెలిసినప్పటికీ దాడులు చేయడానికి వెనకాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ వన్‌ట్‌న్‌లో గుట్కా వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తికి అధికార పార్టీ అండదండలు ఉన్న కారణంగానే అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే వినికిడి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement