Wednesday, April 24, 2024

గుంటూరు జిల్లాలో కారు, బైక్ యాక్సిడెంట్‌.. పంట కాల్వ‌లోకి దూసుకెళ్లిన కారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో కారు, బైక్ యాక్సిడెంట్‌కు గుర‌య్యాయి. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట ద‌గ్గ‌రున్న మలినేని కాలేజ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈక్ర‌మంలో బైక్ నడుపుతున్న వ్యక్తి కి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు స్థానికులు తరలించారు. ఈరోజు ఉద‌యం 7.30 గంట‌ల‌కు ఈ ఘటన జరిగింది. ఎవ‌రూ ఫిర్యాదు చేయ‌క‌పోవ‌డంతో పోలీసులు కూడా ఈ ప్ర‌మాదాన్ని ప‌ట్టించుకోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement