Monday, October 7, 2024

AP | ఏపీలో బస్సు ప్రమాదం.. క్యాబిన్లో ఇరుక్కొని డ్రైవర్ మృతి

ఏలూరు (ప్రభ న్యూస్ క్రైమ్) : ఏలూరు కలపర్రు నేషనల్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు నుండి కాకినాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది, బస్సు డ్రైవర్ ను క్యాబిన్ నుండీ బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి మృతి చెందాడు.

బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని కి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు పై విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement