Thursday, April 25, 2024

Breaking: అక్కడి రైతులు ఇచ్చిందే భూమా.. మా రైతుల‌ది కాదా? టీజీ వెంక‌టేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ స్పందించారు. ప‌లు అంశాల‌పై ఈరోజు మీడియాతో మాట్లాడారు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ ను కర్నూలు చేయాలని డిమాండ్ చేశామ‌న్నారు వెంక‌టేశ్‌. ఇంకా ఏమ‌న్నారంటే..

ఒక్కసారి చాట్టం అయిన త‌ర్వాత‌ మార్పులు చేయడం ఇబ్బంది అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం రాయ‌ల‌సీమ‌ రైతుల భూములు ఇచ్చారు, అమరావతి కోసం అక్కడి రైతులు ఇచ్చారు. అప్పటి త్యాగాలు కనిపించవు కానీ, ఇప్పటి పరిస్థితులే అందరికి కనిపిస్తాయ‌ని టీజీ మండిప‌డ్డారు.

శ్రీ కృష్ణ కమిటీ కూడా మేము కర్నూలును రాజధాని చేయాలని కొరమని అన్నారు ఎంపీ టీజీ వెంక‌టేశ్‌. మాకు హై కోర్టు బెంచ్ ఇవ్వండి, మా నాయకులు కూడా మద్దతు ఇస్తారని పేర్కొన్నామ‌న్నారు. విశాఖలో ఓ బెంచ్ ఏర్పాటు చేయండి. రెండు సంత్సరాలుగా హై కోర్టు కోసం చూస్తున్నాము. విశాఖలో, కర్నూలులో వేసవి కాలం, శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించండి. మా ప్రాంతం నుంచి సోలార్, విండ్ ద్వారా మొత్తం సౌంత్ ఇండియాకు కరెంట్ ఇస్తున్నుము. రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి అని ఎంపీ టీజీ స్ప‌ష్టం చేశారు.

మా ప్రాంతం నుంచి రాజధాని పోయింది, మాకు బాధగా ఉంది. మాకు రీజినల్ డెవలప్మెంట్ కావలి. భూములు కోల్పోయిన వారికి అమరావతి రాజధాని అని చెప్పి మిగితా ప్రాంతాలను అభివృద్ది చేయండి. ముఖ్యమంత్రి నేను చెప్పిన సలహాలు వింటే బీజేపీ నాయకత్వాన్ని ఉపించే బాధ్యత నాది. జ‌గన్ చెప్పిన మాట ప్రాకారం మూడు రాజధానుల బిల్ మ‌ళ్లీ పెడతామని అంటే మళ్లీ కోర్టు కేసులు తప్పవు.. అన్నారు ఎంపీ టీజీ వెంక‌టేశ్‌.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement