Thursday, April 25, 2024

Breaking : ఆర్థిక సంక్షోభంలో జగన్ ప్రభుత్వం.. కేంద్రమంత్రి దేవుసిన్హ్ చౌహన్

కర్నూల్, ప్రభ న్యూస్ బ్యూరో : రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దేవుసిన్హ్ చౌహన్ అన్నారు. మంగళవారం కర్నూల్ నగరంలో ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు కేంద్ర మంత్రులు పార్లమెంట్ స్థానాలలో పర్యటించాలని ఆదేశించారు …జగన్ మంచి పరిపాలన ఇవ్వడంలో విఫలం అయ్యార‌న్నారు. ఇక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలుస వెళ్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు అన్నారు. కేంద్ర నుంచి వచ్చిన ఫండ్స్ ను పేరు మార్చి డబ్బులు వాడుకుంటున్న ఘనత జగన్ ప్రభుత్వంకే దక్కుతుందన్నారు. గ్రామ అభివృద్దికి ఇచ్చిన నిధులను ఈ ప్రభుత్వం కనీసం సమాచారం ఇవ్వకుండా కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొందని, ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొంది అన్నారు. ప్రజాస్వమ్యానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవహార ధరణితో ప్రజలపై భారం పడుతుందనీ మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి ఒక్క సీట్ కూడా రాదన్నారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలుస్తారని తెలిపారు. కేంద్రం లక్షలలో ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి నిధులు ఇచ్చిన ఈ ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేయలేదు.కనీస వసతులు కూడా కల్పించలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రం ఇస్తున్నా నిధులను ఈ ప్రభుత్వం వాడుకోవడం లేదు.ఆయుష్మన్ కార్డు ఇవ్వకుండా ఆరోగ్య శ్రీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రం ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్రం ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదన్నారు.మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ డిక్లరేషన్ లో ఏం చెప్పాం దానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సిద్దేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ గురించి ప్రజలు అడుగుతున్నారు…. తీగెల వంతెన కాకుండా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ కావని ప్రజల నుంచి డిమాండ్ ఉంది.దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో సహకారం ఇస్తున్నట్లు చెప్పారు.రాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో ఉంటూ పనిచేస్తుంది..కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకని పేరు మార్చి వాడుకుంటున్నారు,దీనిపై కేంద్రం సీరియస్ గా ఉందన్నారు. మేం ముందుగానే చెక్ డ్యాం కమ్ బ్రిడ్జి కట్టాలని కట్టాలని కోరాము.బ్రిడ్జి నిర్మాణం పై మూడు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డ్యాం గురించి ముందుకు రావడం లేదు….జనసేన,బీజేపీ సంభందాలు ఇప్పటివరకు బాగా ఉన్నాయి…అప్పటి పరిస్థితులను బట్టి బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.అధిష్టానం క్లియర్ గా చెప్పారు జనసేనతో కలిసి ఉన్నామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement