Saturday, March 25, 2023

గణతంత్రంలోనూ బూతుల ప్రసంగమా? – ప‌వ‌న్ పై బొత్స ఫైర్

అమరావతి, ఆంధ్రప్రభ: రాజకీయాల్లో పవన్‌ కళ్యాణ్‌ సిగ్గుమాలిన సన్నాసి. అలాంటి నాయకుణ్ని చూస్తామను కోలేదు.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతోంది అన్నట్లే పవన్‌ వ్యవహారం తయారైంది అంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. గణతంత్ర దినోత్సవం రోజు ఏం మాట్లాడాలో తెలి యని స్థితిలో పవన్‌ పిచ్చెక్కినట్లు మాట్లాడటం దురదృష్టకర మన్నారు. ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో ఇంత సిగ్గు మాలిన సన్నాసి రాజకీయ నాయకుడ్ని చూస్తామనుకోలెెద న్నారు. స్వాతంత్య్ర ఉద్యమ వీరుల్ని గుర్తు చేసుకోవాల్సిన రోజు ఆ సన్నాసి మాటలు వినడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో తాను మాట్లాడాల్సి వస్తోందన్నారు. జ్ఞానం, ఆలోచన, అను భవం, కమిట్‌మెంట్‌. ఉన్న సీఎం జగన్‌ 151 మంది ఎమ్మె ల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకున్నా.. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఏరోజూ ఆయన నోరు పారేసుకోలేదన్నారు. పొడిచేస్తాం, నరికేస్తాం, చంపే స్తాం, చెప్పు తీసుకుని కొడతాం, తాట తీస్తాం, తోలు వలు స్తాం.. వంటి భాషను ప్రయోగించడం 15 ఏళ్ళలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పవన్‌కే చెల్లిందని చురకలు అంటించారు. లేదు. చంపుతాం.. నరుకుతాం అంటూ చట్టం తన పని తాను చేసుకుపోతోందని బొత్స హెచ్చరించారు.

- Advertisement -
   

కనీస జ్ఞానం లేదు
ఎస్సీ సబ్‌ప్లాన్‌ అంటే ఏంటో తెలియని అజ్ఞాని పవన్‌ కళ్యాణ్‌ అని దుయ్యబట్టారు. సబ్‌ప్లాన్‌ను ప్లానింగ్‌ కమిషన్‌ 2014లోనే రద్దు చేశారని, ఇప్పుడు ఉన్నదాన్ని ఎస్సీ కాంపొ నెంట్‌ అని కూడా అతనికి తెలియదన్నారు. వైసీపీ ప్రభుత్వం డీబీటీ-, నాన్‌ డీబీటీ- విధానంలో 32 పథకాల ద్వారా రూ.60 వేల కోట్లకు పైగా ప్రయోజనాలను ఎస్సీలకు అందించిందని, మరో రూ.16 వేల కోట్లకు పైగా ప్రయోజనాలను ఎస్టీలకు అందజేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేస్తే తప్పేం టని ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్ట్‌ చదవ డం తప్ప పవన్‌కు ఏమీ తేలియదని ఎద్దేవా చేశారు. రిపబ్లిక్‌ డే రోజు ఊగిపోతూ మాట్లాడిన పవన్‌ సమాజానికి ఏం సందేశం ఇచ్చాడని ప్రశ్నించారు.

అందుకే పవన్‌ వ్యతిరేకిస్తున్నాడు
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు వ్యతిరేకించాడు కాబట్టి పవన్‌కళ్యాణ్‌ కూడా వ్యతిరేకిస్తున్నా డన్నారు. తమ విధానం మూడు రాజధానులు మాత్రమే నని మూడు రాష్ట్రాలు అన్లేదన్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ విశాఖకు పరిపాలనా రాజధాని రావడానికి అడ్డుప డుతుంటే మంత్రి ధర్మాన ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలి అన్న మాటను పట్టుకొని పవన్‌ ఊగిపోవడం అవివేకం అన్నారు. ధర్మాన ఆ మాట అన్న సందర్భం గురె ్తరిగి మాట్లాడాలన్నారు. పవన్‌ కళ్యాణ్‌ కారును అడ్డుకో వాల్సిన అవసరం తమకు లేదన్నారు. వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ప్రత్యేకమైన రోజుల్లో ఏమైనా మాట్లాడే ముందు ఆలోచించుకు మాట్లా డాలని పవన్‌కు మంత్రి బొత్స సూచించారు.

నీ స్థాయి కాదు
సీఎం జగన్‌ గురించి కారుకూతలు మాట్లాడే స్థాయి పవన్‌ కళ్యాణ్‌కు లేదన్నారు. పవన్‌ ఒకవేలు చూపెడితే తాము పది వేళ్లు చూపెట్టగలమన్నారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబులా తూలనాడే నాయకుడు జగన్‌ కాదన్నారు. కనీస ఐడియాలజీ లేని పవన్‌ ప్రధాని ని కల్సి ఏం చెబుతాడని ప్రశ్నించారు. ఎవరి కులం వాళ్ళకు గౌరవం, ఎవడి పిచ్చి వాడికి ఆనందనమని పవన్‌పై వ్యంగ్యాస్త్రం సంధించారు. పవన్‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు. లోకేష్‌ మార్నింగ్‌ వాక్‌, ఈవినింగ్‌ వాక్‌ చేస్తే శారీరకంగా తగ్గుతాడమా కానీ ఊడబొడిచేదేమీ లేదన్నారు. పరిపాలన రాజధానిని ఉగాదికల్లా వైజాగ్‌కు తరలించాలని సీఎం జగన్‌పై తాము ఒత్తిడి చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement