Saturday, January 28, 2023

Big Story: 5వ తరగతిలో చేరాలంటే.. ఫీజు 20 వేలు.. డొనేషన్ 10వేలు.. అప్లికేషన్‌కు 2వేలు.. ఇవే కాకుండా..

విజయవాడ భవానీపురా నికి చెందిన రాజారావు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తమ ఇద్దరు పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని బలమైన లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అందుకు ఆర్థిక స్తోమత చాల కపోయినా మరింత కష్ట పడుతూ ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ స్కూల్‌లో ఒకరిని 5వ తరగతి, మరొకరిని 6వ తరగతిలో చేర్పించేందుకు వెళ్లాడు. అయితే ఆ స్కూల్‌ యాజమాన్యం చెప్పిన ఫీజుల వివరాలు విని కళ్లు తేలేశాడు.

5వ తరగతికి రూ. 20 వేలు, 6వ తరగతికి రూ. 25 వేలు, అప్లి కేషన్‌ ఫీజు రూ. 2 వేలు, డొనేషన్‌ క్రింద మరో రూ. 10 వేలు.. ఇవికాకుండా బుక్స్‌కు మరో రూ. 8 వేలు కలిపి బారెడు చిట్టాపద్దు ఆయన చేతిలో పెట్టారు. స్కూల్‌ వ్యాను అయితే అదనంగా ప్రాంతాన్ని బట్టి రూ. 8 వేల నుంచి రూ. 15 వేల వరకు అవుతుందని తమ ఫీజుల వివరాలను క్లియర్‌ గా చెప్పారు. దీంతో రాజారావు ఫీజుల షాక్‌ నుంచి తేరుకుని తాను నిరుపేదనని, ఆటో నడుపుకుంటూ తనలాంటి పరిస్థి తి పిల్లలకు రాకూడదని కార్పొరేట్‌ పాఠశాల లో చేర్పిస్తున్నాను. ఫీజుల విషయంలో కనికరం చూపండని ప్రాధేయపడ్డాడు. ఒకేసారి కట్టలేకపోయినా పర్వాలేదు.. నాలుగు విడతల్లోనైనా చెల్లించండి.. కాకపోతే మరో రూ. 4 వేలు అదనపు భారం పడు తుందంటూ తమ దోపిడీ దందాను మరోసారి బయటపెట్టా రు. ఇది ఉదాహరణ మాత్రమే..

- Advertisement -
   

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఫీజుల దోపిడీ ఇదే తరహాలో సాగుతోంది. ఐతే కార్పొరేట్‌ యాజమాన్యం అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 16వ తేది ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర , జిల్లా స్థాయిలో రెండు కమిటీలను నియమించింది. వారికి ప్రత్యేక అధికారాలను కూడా కేటాయించింది. ఆ నిబంధనల మేరకు ప్రతి ప్రైవేట్‌ పాఠశాలలో నోటీసు బోర్డుకు సమీపంలోనే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ధరల పట్టీ (డిస్‌ప్లే ) ఉండాలి. అయితే అవి ఎక్కడా కూడా కనిపించడం లేదు.

నియంత్రణ కమిటీలు కూడా వాటి గురించి పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో కమిటీలు పాఠశాలలను తనిఖీ చేస్తున్నా కార్పొరేట్‌ యాజమాన్యాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. మరికొన్ని జిల్లాల్లో కమిటీలు మొక్కుబడి తనిఖీలతోనే సరిపెడుతున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ యాజమాన్యానిదే ఇష్టారాజ్యమై పోయింది. ఒక్కచోట కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు అమలవుతున్న దాఖలాలే లేవు. 1వ తరగతి పుస్తకాల ఖరీదు అక్షరాలా రూ. 4500లు అంటే ఇక కార్పొరేట్‌ దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

అమలుకాని ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొచ్చింది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్‌ దందాకు కళ్లెం వేసేందుకు గత ప్రభుత్వాలకు భిన్నంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు ధరలను మాత్రమే వసూలు చేయాలని స్పష్ట మైన ఆదేశాలు జారీ చేశారు.

అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల ల్లో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు రూ. 10 వేలు, టౌన్‌ ప్రాంతాల్లో రూ. 11 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 12 వేలుగా నిర్ణయించారు. అలాగే 6వ తరగతి నుంచి రూ. 10వ తరగతి వరకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 12 వేలు, టౌన్‌ ప్రాంతాల్లో రూ. 15 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 18 వేలు, అలాగే ఇంటర్మీడియట్‌కు సంబంధించి రూ. 20 వేల నుంచి రూ. 30 వేలుగా నిర్ణయించారు. అదేవిధంగా హాస్ట ల్‌లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 18 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 20 వేలు, నగరాల్లో రూ. 24 వేలు.. వ్యాను సౌకర్యం కావాలంటే కిలోమీటరు రూ. 1.20 పైసలు మాత్రమే వసూలు చేయాలని స్పష్ట ంగా చెప్పారు.

ఈ ఫీజులకు మించి అధికంగా వసూలు చేస్తే కొరడా ఝులిపించాలని, అందుకోసం ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అందుకు డబుల్‌ ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement