Thursday, April 18, 2024

Big Story: క్రైమ్ అనాలిసిస్.. స్పెష‌లిస్టుల‌ను రిక్రూట్ చేసుకున్న ఏపీ ఫోరెన్సిక్..

నేర పరిశోధనలో అత్యంత కీలకమైన విభాగం ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్. ఏపీ, తెలంగాణ క‌లిసి ఉన్న‌ప్పుడు హైద‌రాబాద్‌లో నేర ప‌రిశోధ‌న విభాగం ఉండేది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన త‌ర్వాత కూడా చాలా కాలంగా హైద‌రాబాద్‌లోనే ఈ డిపార్ట్ మెంట్ కొన‌సాగింది. ఇప్పుడిప్పుడే ప్ర‌త్యేకంగా ఏపీలో వ‌స‌తులు స‌మ‌కూర్చుకుంటోంది ఈ విభాగం. ఇక నుంచి మరింత బలోపేతం అయ్యేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా దిశ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో ఫోరెన్సిక్ పాత్ర కూడా కీలకంగా మారనుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫొరెన్సిక్ డిపార్ట్మెంట్‌ను బ‌లోపేతం చేయ‌డానికి నిర్ణ‌యం తీసుకుంది.

దిశ వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో భాగంగా నేర పరిశోధనపై ప్రధానంగా దృష్టి సారించింది జ‌గ‌న్‌ స‌ర్కారు. కీలకమైన ఫోరెన్సిక్ మౌళిక సదుపాయాల్ని పటిష్టపరుస్తోంది. రాష్ట్ర విభజన త‌ర్వాత‌ ఫోరెన్సిక్ వ్యవస్థ అంతా హైదరాబాద్‌కు పరిమితమైపోయింది. ఫలితంగా నేర పరిశోధన ఆలస్యమై దోషులను గుర్తించడం, నేరాన్ని నిరూపించడంలో బాగా లేట్ అయ్యేది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోనే ఫోరెన్సిక్‌ సైన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక ల్యాబొరేటరీలతో మౌలిక వసతులను కల్పిస్తూనే.. మరోవైపు పూర్తిస్థాయిలో నిపుణుల నియామకం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది.

రాష్ట్రంలో ఏడు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లతోపాటు (Centre of Excellence) పెద్దఎత్తున నిపుణుల నియామక ప్రక్రియను చేపట్టింది ఏపీ ప్ర‌భుత్వం. అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడలలో దిశ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీల (Ap Forensic Labs) ఏర్పాటుకోసం డీపీఆర్‌లను ఆమోదించింది. డీఎన్‌ఏ పరిశోధన సామర్థ్యాన్ని మూడింతలు.. సైబర్‌ నేర పరిశోధన మౌలిక వసతుల సామర్థ్యాన్ని ఐదింతలు పెంచింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా నియామక ప్రక్రియ చేపట్టింది.

ఇప్పటికే ఏపీలో 58మంది సైంటిఫిక్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 58 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా 8,127 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 3,481 మంది అర్హత సాధించగా 58 మంది ఫైన‌ల్‌గా ఎంపిక‌య్యారు. వీరంద‌రికీ ట్రైనింగ్ ఇస్తోంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement