Tuesday, March 26, 2024

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా 98 లక్షల మందికి లబ్ధి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

అమరావతి, ఆంధ్రప్రభ : వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 98 లక్షల 626 మందికి లబ్ధి చేకూరినట్లు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో స భ్యులు పోతుల సునీత, కళ్యాణీ తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ఈ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 2354 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఫించన్‌ వయో పరిమితి తగ్గించడంతో 10 లక్షల మందికి లబ్ధి చేకూరిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. వైఎస్సార్‌ ఫించన్‌ కానుకతో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 61 లక్షల 16 వేల మందికి పైగా వైఎస్సార్‌ ఫించన్‌ కానుక పొందుతున్నారని తెలిపారు.

ఈ పథకం కోసం ప్రతినెలా రూ. 1440 కోట్లను వెచ్చిస్తున్నామని తెలిపారు. ఇటీవలె ఫించన్‌ మెత్తాన్ని రూ. 2250 నుంచి రూ. 2500లకు పెంచిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫించన్‌ పథకాన్ని మానసిక వికలాంగులు, పక్షవాత వ్యాధిగ్రస్తులకు అమలు చేయాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని మానవతా దృక్పధంతో పరిశీలించాలని కోరారు. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement