Thursday, March 23, 2023

స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్సులు భ‌ద్రం..

అనంతపురం – మార్చి 13 – కడప కర్నూలు అనంతపురం పశ్చిమ రాయలసీమ పట్టబద్రులు ఉపాధ్యాయ ఎన్నికల సంబంధించి పోలింగ్ ముగియడంతో, మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు తెల్లవారుజామున‌ అనంతపురంలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన జేఎన్టీయూ కళాశాల స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూములలో భద్రపరిచే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి , ఇతర అధికారులు పర్యవేక్షించారు. ఈనెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. బాలెట్ బాక్సులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement