Thursday, April 25, 2024

Baby: ముళ్లపొదల్లో చిన్నారి ఆక్రంద‌న‌లు.. ఈ బంగారుత‌ల్లి దొరికింది ఎక్క‌డో తెలుసా..

బెజ్జంకి (ప్రభ న్యూస్): ఒక వైపు పిల్లలు పుట్టక ఆస్ప‌త్రుల‌ వెంబడి కొంత‌మంది తిరుగుతుంటే.. కొంత‌మంది చిన్నారుల‌ను ముళ్ల‌పొద‌ల్లో ప‌డేస్తున్న ఘ‌ట‌న‌లున్నాయి. ఇలాంటి విదాకరమైన ఘటన బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామం లో బుధవారం జ‌రిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

తోటపల్లి ఆన్లైన్ రిజర్వాయర్ సమీపంలో దట్టమైన ముళ్లపొదల్లో ఉదయం ఆడశిశువు అరుపులు వినిపించడంతో అటువైపుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి వెలికి తీశారు. వెంటనే పసికందును ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ నర్సింగరావు, వీఆర్వో శ్రీనివాస్ ఆ పసికందుకు కు వైద్యం చేయించి త‌ల్లిదండ్రుల ఆచూకి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పసికందు మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఎస్సీ సామూహిక భవనంలో జీవనం సాగిస్తున్న బొజ్జ రాధ పసికందును తీసుకొని అక్కున చేర్చుకుంది. దీనితో పసికందు బాధ్యతను బొజ్జ రాధకు అప్పగించినట్లు వీఆర్వో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement