Tuesday, April 16, 2024

AP | భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు.. సివిల్ వివాదాలకు దూరంగా ఉండండి: ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్): భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, సివిల్ వివాదాలకు సంబంధించి క‌చ్చితమైన కోర్టు ఆదేశాలు ఉంటేనే తగిన దర్యాప్తు చేయాలని.. అనవసరంగా ఎస్ హెచ్ ఓ లు ఈ కేసుల్లో తల దూర్చరాదని తిరుప‌తి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో.. పద్మావతి మహిళ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్‌లో నేర సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విజిబుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ, పోలీస్స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగాలన్నారు. గంజాయి వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు అక్రమ రవాణా, అమ్మకాలు చేస్తూ ఉంటే మెరుపు దాడులు నిర్వహించాల‌న్నారు. జిల్లాలో అక్రమ మద్యం .గంజాయి . నాటు సారాయి స్థావరాలపై పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో బృందాలు దాడులు చేప‌ట్టాల‌ని సూచించారు. జిల్లాలో అక్రమ రవాణా కేసులున్న వారిపై పిడి యాక్ట్ ప్రయోగించాలని అధికారులకు ఆదేశించారు.

ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంతో పాటు నాన్‌బేయిల‌బుల్‌ వారెంట్ ను జారీ చేయాల‌ని, చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేశారు. ఎస్. హెచ్ .ఓ. తమ పరిధిలో నివాసముంటున్న రౌడీషీటర్లను అనుమానితులను రాజకీయ సామాజిక ట్రైబల్ మా oగర్స్. అసాంఘిక శక్తులు యొక్క కదలికలపై నిరంతరం నిఘా ఉంచడంతోపాటు కౌన్సిలింగ్ ఇస్తూ శాంతిభద్రతల నియంత్రణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

- Advertisement -

మహిళ పోలీస్ వ్యవస్థను జిల్లా వ్యాప్తంగా కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో బలోపేతం చేసి మంచి ఫలితాలను సాధిస్తున్నారు అన్నారు. ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడితే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ కేసులను పెంచాలని తద్వారా తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఆర్థిక అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement