Thursday, April 25, 2024

చట్ట సభల్లో దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. కె.ఎస్.జవహర్

చ‌ట్ట‌స‌భ‌ల్లో దాడులు ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాద‌మ‌ని ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జ‌వ‌హ‌ర్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… సెమీ ఫైనల్స్ అన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు చోట్లా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిందన్నారు. వైసీపీకి గ్రాడ్యుయేట్స్ చుక్కలు చూపించారన్నారు. కర్ర కాల్చి వాత పెట్టారన్నారు. ఆ ఫ్రష్టేషన్ ఈ రోజు అసెంబ్లీలో వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపించిందన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యుల గెలుపుని జీర్ణించుకోలేక శాసనసభ సాక్షిగా దిడికి దిగారన్నారు. ప్రజల్ని, ప్రజాసంఘాల్ని, ప్రతిపక్షాలను నిలువరించేలా జీవో తెచ్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్నారన్నారు.

జీవో నెం.1పై చర్చ జరపాలని డిమాండ్ చేసిన సభ్యులపై ఉద్దేశ్యపూర్వకంగా దాడికి దిగారన్నారు. ప్రతిపక్షంగా సభలో చర్చకు డిమాండ్ చేసే హక్కుందని, అక్కడకు వైసీపీ సభ్యులు రావాల్సిన అవసరం ఏమిటి ? ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఈ రోజు చట్ట సభల సాక్షిగా చూశామ‌న్నారు. జగన్ రెడ్డీ… నీ దాడులు, దౌర్జన్యాలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెనకడుగేయరన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోరాడుతాం. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి జగన్ రెడ్డిని, వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయడం తథ్య‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement